← Back to news

బుక్ రిలీజ్ క్యాన్సిల్.. హమారా ప్రసాద్ అరెస్ట్?

By Mahesh· 3h ago
బుక్ రిలీజ్ క్యాన్సిల్.. హమారా ప్రసాద్ అరెస్ట్?

TG: కొంత కాలంగా ‘కల్పిత నాయకుడు’ పుస్తకం చుట్టూ వివాదం నెలకొంది. ఈ పుస్తకంలో డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌పై పరువు నష్టం కలిగించేలా కంటెంట్ ఉందనే ఆరోపణలతో రచయిత హమారా ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. దీంతో రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరగాల్సిన పుస్తక విడుదల కార్యక్రమం కూడా క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. పుస్తకంలోని కంటెంట్‌పై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

More in TG

బోల్తా పడిన XUV 700 కారు.. మహిళకు గాయాలు
TG· 3h ago

బోల్తా పడిన XUV 700 కారు.. మహిళకు గాయాలు

TG: హైదరాబాద్‌ పంజాగుట్టలో ఈరోజు పెద్ద ప్రమాదం తప్పింది. బేగంపేట నుంచి పంజాగుట్ట వైపు వెళ్తున్న XUV 700 కారు లైఫ్‌స్టైల్ బిల్డింగ్‌ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. కారులో మహిళా డ్రైవర్ ఒక్కరే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ఆమె కారులో చిక్కుకోగా.. స్థానికులు వెంటనే బయటకు తీసి రక్షించారు. ఆమెకు చిన్న గాయాలవ్వగా, ఆ టైమ్‌లో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో పంజాగుట్ట పోలీసులు స్పాట్‌కు చేరుకుని ప్రమాదానికి కారణాలపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. <a href="https://x.com/TheSiasatDaily/status/2100560044597420441?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2100560044597420441%7Ctwgr%5E20015ea7cecccc412ab6f2c2c6f20a30e574b1ae%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.siasat.com%2Fpossible-hit-and-run-causes-car-to-overturn-in-hyderabad-3543806%2F">వీడియో లింక్</a>