యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య

యూట్యూబర్ వైష్ణవి భర్తను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. నిజామాబాద్ ఆర్‌ఆర్ చౌరస్తా దగ్గర ఇవాళ సాయంత్రం కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడి చేయడంతో హరిబాబు స్పాట్‌లోనే చనిపోయాడు. సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి డీటెయిల్స్ సేకరించారు. బాడీని మార్చురీకి షిఫ్ట్ చేశారు. నిందితుల కోసం పోలీసులు సెర్చ్ చేస్తున్నారు.



