4వ రోజూ తగ్గేదేలే అంటున్న INDIA బ్లాక్

CEC జ్ఞానేశ్ కుమార్‌కి వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రతిపక్షాల ఆందోళనలు నాలుగో రోజుకు చేరాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో కాంగ్రెస్ MPల సమావేశం జరగనుంది. ఇందులో INDIA బ్లాక్ MPలు కూడా పాల్గొంటారు. సమావేశం తర్వాత పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్లే అవకాశం ఉంది. S.I.Rలో EC తీరును నిరసిస్తూ ప్రతిపక్షాలు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నాయి. CEC రిజైన్ చేయాలనే డిమాండ్‌తో ప్రొటెస్టులను మరింత ఉద్ధృతం చేసే ప్లాన్‌లో ఉన్నాయి.


