రామ మందిర్ ట్రస్ట్ తొలి CEOగా జితేంద్ర మిశ్రా!

అయోధ్య రామ మందిర్ ట్రస్ట్‌కు తొలి <a href="https://www.indiatvnews.com/news/india/air-marshal-jeetendra-mishra-to-be-first-ceo-of-ayodhya-ram-temple-trust-latest-updates-2026-09-02-1053071">Chief Executive Officer (CEO)</a>గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా సెలెక్ట్ అయ్యారు. ఈరోజు జరిగిన ట్రస్ట్ కీలక మీటింగ్‌లో ఈ డెసిషన్ తీసుకున్నారు. మొత్తం 5,585 అప్లికేషన్స్ రాగా, చివరకు ముగ్గురిని షార్ట్‌లిస్ట్ చేశారు. వారిలో జితేంద్ర మిశ్రాను ఎంపిక చేశారు. టెంపుల్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్, లీగల్ విషయాలు, డెవలప్‌మెంట్ పనులను ఆయన చూసుకోనున్నారు. ఆలయ పనితీరును మరింత పకడ్బందీగా నిర్వహించడమే ఈ పదవి ఉద్దేశమని ట్రస్ట్ తెలిపింది.



