← Back to news

TOSS ప్రవేశాలపై పోస్టర్ ఆవిష్కరణ

By Mallesh Yadav· 19 Aug 2026· Medak (R), Medak, Medak
TOSS ప్రవేశాలపై పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్ SSC, ఇంటర్మీడియట్ ప్రవేశాలపై రూపొందించిన ప్రచార పోస్టర్‌ను మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. రాజు ఆవిష్కరించారు. జిల్లా కోఆర్డినేటర్ ఎ. వరప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కరుణాకర్, డీఈఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. చదువును మధ్యలో నిలిపివేసిన వారు, ఉద్యోగులు, గృహిణులు, రెగ్యులర్ విద్య కొనసాగించలేని వారికి TOSS మంచి ప్రత్యామ్నాయమని తెలిపారు.

More in Local