← Back to news

ఆ విద్యార్థినిని ఆదుకోండి ప్లీజ్...

By Ravi G· 2h ago· Kamareddy, Kamareddy, Kamareddy
ఆ విద్యార్థినిని ఆదుకోండి ప్లీజ్...

కామారెడ్డి జిల్లా కాళోజీవాడి గ్రామానికి చెందిన గడ్డం హేమచంద్రిక దోమకొండ బాలికల హాస్టల్‌లో 9వ క్లాసుచదువుతోంది. ఈ నెల 19న రాత్రి ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. నిజామాబాద్ వెల్నెస్ హాస్పిటల్‌లో అత్యవసర బ్రెయిన్ సర్జరీ జరిగింది. తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. సర్కారు తరఫున సాయం కోసం జిల్లా అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. జిల్లా అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు కొత్తోల గంగారాం, ధ్యామని భూపతి, మోహన్, రమేష్,తదితరులు పాల్గొన్నారు.

ఆ విద్యార్థినిని ఆదుకోండి ప్లీజ్...

More in Local