← Back to news

టెలిగ్రామ్‌లో జాబ్ ఆఫర్.. భారీ మోసం

By dk· 3 Aug 2026· హైదరాబాద్
టెలిగ్రామ్‌లో జాబ్ ఆఫర్.. భారీ మోసం

TG: టెలిగ్రామ్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో వచ్చిన మెసెజ్‌ను నమ్మిన HYDలోని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన విద్యార్థి చరణ్ కౌశిక్‌ రూ.4.31 లక్షలు కోల్పోయాడు. మొదట గూగుల్ రివ్యూలు పూర్తిచేస్తే పారితోషికం ఇచ్చి నమ్మకం కల్పించిన సైబర్ మోసగాళ్లు, తర్వాత పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని ఆశ చూపించారు. తొలుత లాభాలు చెల్లించడంతో బాధితుడు కుటుంబసభ్యుల సహకారంతో దశలవారీగా పెద్దమొత్తంలో డబ్బు చెల్లించాడు. చివరకు రూ.4.31 లక్షలు కోల్పోయిన తర్వాత మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 9h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.