← Back to news

CJP టీమ్‌పై దాడి..అభిజీత్ దీప్కే రియాక్షన్

By Vishi· 21 Aug 2026

‘స్కూల్ ఠీక్ కరో’ క్యాంపెయిన్‌లో భాగంగా జైపూర్ జిల్లా రాంపురా కన్వర్పురాలోని ప్రభుత్వ పాఠశాలను వెళ్లిన CJP టీమ్‌పై కొందరు దాడి చేశారు. ఇది బీజేపీ గూండాల పనే అని టీమ్ ఆరోపించింది. వాళ్లు రాళ్లు విసిరి, కారు కిటికీలు పగలగొట్టి, కొందరు వాలంటీర్లను కొట్టారని తెలిపింది. ఆశుతోష్ రాంకాపై కూడా దాడి జరిగింది. దీనిపై అభిజీత్ దీప్కే రియాక్ట్ అయ్యారు. ‘స్కూల్ రిపేర్ పనులు మొదలుకాకపోయినా, బీజేపీ గూండాలను అరెస్టు చేయకపోయినా 48 గంటల్లో నేను జైపూర్‌కు వెళ్తాను’ అని ప్రకటించారు.

More in Current Affairs