← Back to news

3 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం

By Prashanth· 4 Oct 2026· Andhra Pradesh

AP: తెనాలి మండలం బుర్రిపాలెం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి CM చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా 3D ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం చేపట్టే విధానాన్ని CBRI అధికారులు CMకు వివరించారు. తక్కువ సమయంలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే టెక్నాలజీపై అధికారులు వివరాలు అందించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

More in AP