మిర్చి ఎగుమతుల సమస్యలపై మిర్చియార్డ్ చైర్మన్ సమావేశం

AP: గుంటూరు మిర్చియార్డులో చైర్మన్ కుర్రా అప్పారావు ఆధ్వర్యంలో మిర్చి ఎగుమతిదారులతో సమావేశం జరిగింది. శ్రీలంకలో అఫ్లాటాక్సిన్ సమస్యతో నిలిచిపోయిన మిర్చి కంటైనర్లపై చర్చించారు. ఈ అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చైర్మన్ తెలిపారు. ప్రతి మండలంలో మిర్చి ఎండబెట్టే ప్లాట్ ఫారమ్‌లు ఏర్పాటు చేసి, రైతులకు నాణ్యతపై అవగాహన కల్పించాలని ఎగుమతిదారులు సూచించారు.



