← Back to news

ఢిల్లీలో ఓటర్ల లిస్ట్‌ నుంచి 47.7 లక్షల పేర్లు తొలగించారా?

By Nani Garikina· 3d ago· Indiatimes
ఢిల్లీలో ఓటర్ల లిస్ట్‌ నుంచి 47.7 లక్షల పేర్లు తొలగించారా?

ఢిల్లీలో ఓటర్ల లిస్ట్‌లో భారీ మార్పులు ఇప్పుడు చర్చగా మారాయి. ఇప్పటివరకు ఉన్న 1.45 కోట్ల మంది ఓటర్లలో 47.7 లక్షల మంది పేర్లు కొత్త SIR డ్రాఫ్ట్‌ లిస్ట్‌లో కనిపించలేదు. వీరిలో చాలామంది ఇల్లు మారినవారు లేదా అందుబాటులో లేనివారిగా గుర్తించారు. కొంతమంది పేర్లు డూప్లికేట్‌గా, మరికొన్ని మరణించినవారివిగా గుర్తించారు. అయితే ఇది ఇంకా ఫైనల్‌ లిస్ట్‌ కాదు. పేరు కనిపించని అర్హులైన ఓటర్లు సెప్టెంబర్‌ 30 వరకు తమ పేరు మళ్లీ చేర్చాలని క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 1h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.