విద్యుత్ అమరవీరులకు ఘన నివాళులు

TG: విద్యుత్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో సీపీఎం ఆధ్వర్యంలో స్మారక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో విద్యుత్ అమరవీరులు రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి చిత్రపటాలకు సీపీఎం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి. ఆంజనేయులు మాట్లాడుతూ.. విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో నూతన విద్యుత్ సవరణ చట్టం రద్దయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

