మైనర్‌పై లైంగిక దాడి.. వ్యక్తిపై పోక్సో కేసు నమోదు!

హైదరాబాద్ అల్వాల్‌లో 16 ఏళ్ల ఇంటర్ విద్యార్థినిపై పలువురు యువకులు నెలలుగా లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికను మత్తుపదార్థాలకు అలవాటు చేసి కారులో, ఓయో గదిలో, రైలులో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి వెళ్లిన బాలికకు రైల్వే స్టేషన్‌లో యువకులు పరిచయమైనట్లు సమాచారం. వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరిన బాలిక కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదు చేసి నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.


