విద్యాశాఖ కమిషనరేట్ వద్ద ABVP ఆందోళన.. ఉద్రిక్తత

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న మౌలికవసతుల సమస్యలను పరిష్కరించాలని ABVP ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని విద్యాశాఖ కమిషనరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ABVP నేతలు డిమాండ్ చేశారు. విద్యాశాఖ కార్యాలయంలోనికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది.



