గర్భిణులు పోషకాహారంపై శ్రద్ధ చూపాలి

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం పాపయ్యపల్లి అంగన్వాడీ కేంద్రంలో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొని పండుగ సందడి చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొల్లం శ్రీధర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు.

