← Back to news

నందిపేట్ కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడిగా అక్బర్ నియామకం

By naveed· 1d ago
నందిపేట్ కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడిగా అక్బర్ నియామకం

నందిపేట్ మండల కాంగ్రెస్ ముస్లిం మైనార్టీ అధ్యక్షుడిగా అక్బర్ నియమితులయ్యారు. గురువారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు దూడ వెంకటేష్ నియామక పత్రం అందజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అక్బర్ తనపై నమ్మకం ఉంచిన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపి, బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తానని అన్నారు.ఈ సందర్భంగా దూడ వెంకటేష్‌ మాట్లాడుతూ.. అక్బర్‌ మైనార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.