ఎండిన మర్రిచెట్టుపై పచ్చని తాటిచెట్టు
TG : నర్సంపేట లక్నేపల్లి వద్ద ఒక ప్రకృతి వింత నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. అక్కడ పూర్తిగా ఎండిపోయిన ఒక పెద్ద మర్రిచెట్టు కొమ్మల మధ్య నుంచి తాటిచెట్టు పచ్చగా పెరుగుతోంది. తాను ఎండిపోయినా తాటిచెట్టుకు ఆసరాగా నిలిచిన మర్రిచెట్టు దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వింతను చూసేందుకు స్థానికులు ఆసక్తిగా తరలివస్తున్నారు.


