ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం
TG: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యలను నిరసిస్తూ BRS నాయకులు ఆందోళన చేపట్టారు. మాజీ సీఎం కేసీఆర్ చనిపోవాలని కోరుకుంటున్నామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపిస్తూ పట్టణ కూడలిలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన BRS నాయకులు, ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.



