నారాయణపేట జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి: సీపీఎం

నారాయణపేట జిల్లాలో లోటు వర్షపాతం కారణంగా పంటలు ఎండిపోతున్నాయని, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని CPM జిల్లా కార్యదర్శి జి. వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. నారాయణపేట మున్సిపల్ పార్కు వద్ద CPM ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎండిన పంటలకు ఎకరాకు ₹.25 వేల పరిహారం చెల్లించాలని, ఉపాధి హామీ పనిరోజులను పెంచాలని, తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. అనంతరం కలెక్టర్ సి.హెచ్. ప్రియాంకకు వినతిపత్రం అందజేశారు.

