← Back to news

54 లక్షల అలంకరణతో మెరిసిపోతున్న అమ్మవారు!

By Bala· 49m ago

హైదరాబాద్‌ రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్గూడ హైందవనగర్‌లో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని లక్ష్మీదేవి అవతారంలో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ అలంకరణకు ఏకంగా ₹54 లక్షలు ఖర్చు చేశారు. అందంగా ముస్తాబైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

More in Local

ప్రమాద బాధితులకు అండగా ఉంటాం
Local· 57m ago

ప్రమాద బాధితులకు అండగా ఉంటాం

కర్ణాటక భారత్‌మాల రహదారిపై జరిగిన రోడ్డు ప్రమదంలో గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. <a href="https://www.theclearcutnews.com/n/3S37duN">ప్రమాద </a>బాధితులకు కార్మిక సంక్షేమ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వేణుగోపాల్ తెలిపారు. ప్రమాదంపై గ్రామంలో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, <a href="https://www.theclearcutnews.com/n/z9ZFspr">మృతి చెందిన</a> నాగన్న, యేసేపు కుటుంబాలతో పాటు గాయపడిన 19మంది వివరాలు సేకరించారు. అర్హులకు ప్రమాద బీమా, ఇతర సంక్షేమ ప్రయోజనాలు అందించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.