← Back to news

జిల్లా బెస్ట్ టీచర్‌గా సాతూరి ప్రసాద్

By rajinikanth nagilla· 1h ago· Hanumakonda
జిల్లా బెస్ట్ టీచర్‌గా సాతూరి ప్రసాద్

TG హన్మకొండ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా సాతూరి ప్రసాద్ ఎంపికయ్యారు. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సాతూరి ప్రసాద్‌ను తెలంగాణ ప్రభుత్వం హన్మకొండ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రకటించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో ఆయనకు చోటు దక్కింది. జిల్లాలో నిర్వహించనున్న గురుపూజోత్సవ కార్యక్రమంలో సాతూరి ప్రసాద్ అవార్డును అందుకోనున్నారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 10h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.