← Back to news

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

By rajinikanth nagilla· 58m ago· Hanumakonda
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

TG: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, అధికారులు వెంటనే పరిష్కరించాలని USFI హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల మనోజ్ డిమాండ్ చేశారు. USFI జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భీమదేవరపల్లి మండలంలోని సంక్షేమ హాస్టళ్లను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వంగరలోని ఎస్సీ బాలుర హాస్టల్‌ను పరిశీలించారు. పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని మనోజ్ తెలిపారు. రాత్రివేళల్లో వాచ్‌మన్ లేకపోవడం విద్యార్థుల భద్రత సమస్యగా మారుతోందన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 10h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.