← Back to news

గుత్తికొండలో ఘనంగా ఉర్సు ఉత్సవాలు

By MADDIMANENI PRASANNAKUMAR· 53m ago· Ananthapuramu
గుత్తికొండలో ఘనంగా ఉర్సు ఉత్సవాలు

AP: పల్నాడు జిల్లా గుత్తికొండలో హజరత్ సయ్యద్ షా వలి బాషా ఖాద్రి రహమతుల్లా అలైహి ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఆనవాయితీగా జరిగే వేడుకలకు భక్తులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఉరుసు ఉత్సవాల్లో వివిధ మతాలకు చెందిన ప్రజలు పాల్గొని ఐక్యతను చాటారు. ఉరుసు సందర్భంగా నిర్వహించిన ఖవ్వాలి, ఆర్కెస్ట్రా కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాకారుల పాటలు, సంగీతంతో ఉత్సవ ప్రాంగణం సందడిగా మారింది.

గుత్తికొండలో ఘనంగా ఉర్సు ఉత్సవాలు

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 10h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.