ఆశాభోంస్లే ఆస్తులెంతో తెలుసా?

అమరగాయని ఆశాభోంస్లే ఆస్తులెంతో తెలుసా? దాదాపు 250 కోట్ల ఆస్తులకు మహారాణి ఆమె.అందులో వంద కోట్లు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలే ఉన్నాయి.అవికాక వాల్డ్ వైడ్ గా ఆశా పేరుతో చైన్ రెస్టారెంట్లు ఉన్నాయి. భిన్న భాషల్లో , వేల పాటలు పాడిన ఆశాజీ బాలీవుడ్ సింగర్స్ లో చాలా ఏళ్లు టాప్ రేంజ్ లో ఉన్నారు. క్లాసికల్స్, గజల్స్, కేబరే, పాప్, ర్యాప్.. ఇలా ఆమె పాడని పాటంటూలేదు. మెయిన్ స్ట్రీమ్ లో పాటలు పాడటం తగ్గించినా.. స్టేజ్ షోలు, కచేరీలు చాలా చేశారు. ఎన్నో ఫారిన్ ట్రిప్ లకు వెళ్లేవారు. ఆ రాయల్టీలన్నీ కలిపి ఇంత పెద్ద ఎంపైర్ ను స్థాపించుకున్నారు.



