ఇది పబ్లిసిటీ కోసమా? ఢిల్లీ పోలీసులకు హై కోర్టు చురకలు

NEET పేపర్ లీకేజీకి నిరసనగా 'కాక్రోచ్ జనతా పార్టీ' మార్చ్ లో పోలీసులు జరిపిన లాఠీఛార్జ్‌పై దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారించింది. కేంద్రం తరఫు న్యాయవాది ఇది కేవలం పబ్లిసిటీ కోసం వేసిన పిటిషన్ అని వాదించగా, కోర్టు దానిని తోసిపుచ్చింది. ఇది విడివిడిగా ఎక్కడో ఒకసారి జరిగిన చిన్న ఘటన కాదని స్పష్టం చేస్తూ కేంద్రం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా, ఈ ఇన్సిడెంట్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరచాలని పోలీసులను ఆదేశించింది.



