"నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి”.. అనంత్ అంబానీ

AP: ఈ రోజు మదనపల్లెలో జరిగిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రోగ్రాంకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అనంత్ అంబానీ వచ్చారు. ఆయన మాట్లాడాతు “నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. రాష్ట్రానికి నేనేం చేయగలనో గైడ్ చేయండి” అని సీఎం చంద్రబాబును కోరారు. ఏపీ వ్యవసాయం, ఉద్యానవనం అభివృద్ధికి రిలయన్స్ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. తర్వాత నిర్మలా సీతారామన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ఆయనను అభినందించారు.

