మణిపూర్‌లో వేలాది మంది మహిళల టార్చ్ ర్యాలీ
మణిపూర్ రాష్ట్రంలో సెన్సస్ నిర్వహణకు ముందు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(NRC)ను అప్‌డేట్ చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది మహిళలు శనివారం రాత్రి ఇంఫాల్‌లో టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఖురై అపుంబా క్లబ్ మహిళా సభ్యులు “No NRC, No Census” అనే నినాదాలతో బ్యానర్లు పట్టుకుని, చేతుల్లో మంటలు పట్టుకుని వీధుల్లో ర్యాలీ చేశారు. సెన్సస్‌పై తమకు వ్యతిరేకత లేదని, కానీ ముందుగా NRC అమలు చేసి బయటివారిని గుర్తించి తొలగించాలని డిమాండ్ చేశారు.


