← Back to news

గురజాలలో ఎల్‌ఐసీ వారోత్సవాలు

By SHAIK SUBHANI· 2d ago
గురజాలలో ఎల్‌ఐసీ వారోత్సవాలు

AP: పల్నాడు జిల్లా గురజాలలో ఎల్‌ఐసీ 70 ఏళ్లు పూర్తి చేసుకుని 71వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి గురజాల నగర పంచాయతీ కమిషనర్ వై.వి.ఎల్. శివన్నారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రగతిలో ఎల్‌ఐసీ అందిస్తున్న ఆర్థిక సహకారం, పాలసీదారులకు సిబ్బంది, ఏజెంట్లు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. అనంతరం కమిషనర్‌ను ఎల్‌ఐసీ సిబ్బంది శాలువాతో సత్కరించారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 8h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.