← Back to news

పదేళ్ల సేవలకు గుర్తింపు.. బీర గాంధీకి కీలక పదవి

By NANI M· 20 Aug 2026· Rowthulapudi, Rowthulapudi, Kakinada
పదేళ్ల సేవలకు గుర్తింపు.. బీర గాంధీకి కీలక పదవి

AP: కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం లచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన బీర గాంధీకి అంబేడ్కర్స్ ఇండియా మిషన్‌లో కీలక బాధ్యత దక్కింది. సంస్థతో దాదాపు పదేళ్లుగా కొనసాగుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలు, సమానత్వం, సామాజిక న్యాయం కోసం పలు కార్యక్రమాల్లో చురుకుగా పనిచేసిన ఆయన సేవలను గుర్తించి సంస్థ వ్యవస్థాపకులు పీవీ సునీల్ కుమార్ రాష్ట్ర సలహా కమిటీ సభ్యుడిగా నియమించారు. ఈ సందర్భంగా బీర గాంధీకి పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.

More in Local