← Back to news

ఉచిత Wifiతో జాగ్రత్త

By Anusha· 9 Sept 2026
ఉచిత Wifiతో జాగ్రత్త

ఉచిత పబ్లిక్‌ వైఫైను వాడే టైంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుర్తుతెలియని వైఫై నెట్‌వర్క్‌లకు కనెక్ట్‌ అయ్యాక వచ్చే APK ఫైళ్లను డౌన్‌లోడ్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేస్తే మొబైల్‌లోని వ్యక్తిగత, ఆర్థిక సమాచారం ప్రమాదంలో పడే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల ముంబైలోని CSMT వద్ద ఉచిత వైఫైను ఉపయోగించిన ఓ వ్యక్తికి నకిలీ APK ఫైల్‌ రావడంతో సైబర్‌ మోసం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో సుమారు రూ.4.27 లక్షలు అతని అకౌంట్ నుంచి ట్రాన్‌సాక్షన్స్ జరిగినట్లు సమాచారం.

More in Infotainment