పెళ్లిలో డ్రెస్స్ ఐరన్, షూ పాలిష్, మరియు సెలూన్ ఏర్పాట్లు!
సాధారణంగా పెళ్లిళ్లలో విందు భోజనాలు, డిజె లాంటివి ఉంటాయి. కానీ ఈ పెళ్లిలో మాత్రం గెస్ట్ ల కోసం బట్టలు ఐరన్ చేసే ఏర్పాటు, షూ పాలిష్, సెలూన్ మరియు మేకప్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. పెళ్లికి వచ్చిన వారు తమ లుక్ మార్చుకుంటూ ఈ కొత్త ఏర్పాట్లకు ముగ్ధులవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వింత ఆతిథ్యంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.



