ఫ్లైట్ ప్రయాణికులకు బిగ్ షాక్!

జెట్ ఫ్యూయల్ ధరలు పెరగడంతో దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. తమ డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌లో ఫ్యూయల్ సర్‌ఛార్జ్ పెంచుతున్నట్లు అనౌన్స్ చేసింది. దీనివల్ల ఫ్లైట్ టికెట్ ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రయాణించే డిస్టెన్స్ ని బట్టి ₹375 నుండి ₹1,300 వరకు సర్‌ఛార్జ్ పడనుంది. ఇక ఇంటర్నేషనల్ రూట్స్ లో సార్క్ కంట్రీస్‌కు ₹3,000, ఆఫ్రికాకు ₹6,000, యూరప్ వెళ్లే ఫ్లైట్స్‌పై ఏకంగా ₹10,000 వరకు అదనపు భారం పడనుంది. ఈనిబంధనలు మంగళవారం నుంచే అమలులోకి వస్తాయి

