దసరా వేళ పాలపిట్టల బిజినెస్.. సజ్జనార్ ట్వీట్

దసరా పండుగ పేరుతో తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను బంధించి అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని V.C. సజ్జనార్ హెచ్చరించారు. మూగజీవాలను హింసించి పండుగ చేసుకోవడం అశుభమని, వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్-1972 ప్రకారం ఇది పక్కా క్రిమినల్ నేరమని స్పష్టం చేశారు. ఎక్కడైనా పాలపిట్టలను బోన్లలో బంధిస్తే వెంటనే 112 లేదా టోల్ ఫ్రీ నంబర్ 18004255364కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుతూ, అందరూ ఎకో-ఫ్రెండ్లీ దసరాను సెలబ్రేట్ చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.


