డ్రోన్ల భయంతో ఫైటర్ జెట్లు.. ఆపై అసలు ట్విస్ట్!

లిథువేనియా దేశంలోని ఆకాశంలో అనుమానాస్పద కదలికలను రాడార్ గుర్తించింది. దీంతో నాటో కమాండ్ అప్రమత్తమైంది. అవి డ్రోన్లు కావొచ్చని భావించి ఇటలీకి చెందిన యుద్ధ విమానాలను వెంటనే గాల్లోకి పంపించింది. అయితే దగ్గరకు వెళ్లి పరిశీలించాక అసలు విషయం తెలిసింది. అవి డ్రోన్లు కాదని, ఒక క్రమంలో ఎగురుతున్న పక్షుల గుంపని తేలింది. ముందుజాగ్రత్తగా విల్నియస్ అంతర్జాతీయ విమానాశ్రయాలను మూసివేశారు. పక్షుల గుంపు, డ్రోన్ల రాడార్ సిగ్నేచర్ కొన్ని సందర్భాల్లో ఒకేలా కనిపించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.



