జూలో ‘చైల్డ్ ప్రిడేటర్ టూర్’.. అసలు విషయం ఇదే!

UKలోని చెస్టర్ జూ వెబ్‌సైట్‌లో జంతువులను చూపించే టూర్‌కు పొరపాటున ‘Child Predator Tour’(బాలల్ని లైంగికంగా వేధించే వ్యక్తి టూర్) అనే పేరు కనిపించడంతో సందర్శకులు ఆశ్చర్యపోయారు. 90 నిమిషాల ఈ టూర్‌లో సుమత్రా పులులు, సింహాలు, ఖడ్గమృగాలు, కొమోడో డ్రాగన్‌లను చూపించాల్సి ఉంది. తమ సిస్టమ్‌లోని డిఫాల్ట్ నేమింగ్ విధానం వల్ల ఈ పొరపాటు జరిగిందని జూ యాజమాన్యం తెలిపింది. విషయం గుర్తించిన వెంటనే పేరును మార్చినట్లు వెల్లడించింది. ఈ తప్పిదంపై నెటిజన్లు SMలో సెటైర్లు వేశారు.



