ఓట్ చోరీ సూత్రధారి ఆయనే: అరవింద్ కేజ్రీవాల్
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు చేశారు. ‘ప్రధాని మోడీ, అమిత్ షా వోట్లు దొంగిలించి ఎన్నికలు గెలుస్తున్నారని అనుకునేవాళ్లం. ఇవాళ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ చూస్తే అది నిజమని తెలిసింది. ఈ వోట్ దొంగతనానికి మాస్టర్‌మైండ్ సీఈసీ జ్ఞానేశ్ కుమార్’ అని అన్నారు. జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే అరెస్ట్ చేసి దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
