'రాజకీయాల్లో యువత ముందుండాలి'

వరంగల్ జిల్లా చంద్ర రావు పేట మండలం ఎల్లాయిగూడెంలో యువజన కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక నిర్వహించారు. మండల అధ్యక్షుడు బండి హరీశ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రూపిక శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. యువత హక్కుల కోసం పోరాడుతూ, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాల కల్పన, గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు.


