← Back to news

పరిగిలో వీధి కుక్కల బీభత్సం

By Naresh Kumar· 55m ago· Pargi, Pargi, Vikarabad
పరిగిలో వీధి కుక్కల బీభత్సం

వికారాబాద్ జిల్లా పరిగిలోని తిరుమల రెసిడెన్సీ కాలనీలో వీధి కుక్కలు చిన్నారులపై దాడి చేస్తున్నాయి. ఇప్పటికే నలుగురు పిల్లలను కరిచి గాయపరిచాయి. ఓ చిన్నారి గొంతు పట్టుకోగా, మరో చిన్నారి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కుక్కల బెడదపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

More in Local