← Back to news

మద్యం మత్తు.. బస్సుతో లాంగ్ డ్రైవ్

By DK· 2 Aug 2026· అనంతపురం జిల్లా
మద్యం మత్తు.. బస్సుతో లాంగ్ డ్రైవ్

AP: మద్యం మత్తులో ఓ వ్యక్తి RTC బస్సునే చోరీ చేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. గార్లదిన్నెకు చెందిన డి.శివశంకర్ రాత్రి తన పెంపుడు కుక్కతో కలిసి కదిరికి చేరుకుని, బస్టాండ్‌లో ఉన్న ఆర్టీసీ అద్దె బస్సును తీసుకెళ్లాడు. మద్యం మత్తులో డివైడర్లు, చెట్లను ఢీకొడుతూ అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం తట్టివారిపల్లె వరకు వెళ్లాడు. అనంతరం బస్సును అక్కడే నిలిపి జరిగిన విషయాన్ని మదనపల్లె బస్టాండ్ సిబ్బందికి తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు బస్సును స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

More in AP