ఎల్‌నినో గురించి ఆందోళన వద్దు: పొంగులేటి

TG: ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండ కలెక్టరేట్ అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో లోటు వర్షపాతం నమోదైయింది. తాగునీరు, వ్యవసాయం, భూగర్భ జలాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిగా దేవసేన(ఐఏఎస్)ను నియమించామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు. ఎల్‌నినో గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు.



