రాత్రి 10 తర్వాత డిన్నర్.. అనారోగ్యమే!

TG: హైదరాబాద్‌లో 64 శాతం మంది ఉద్యోగులు రాత్రి 10 గంటల తర్వాతే డిన్నర్ చేస్తున్నట్లు బ్లూసెమీకి చెందిన ఐవా వెల్‌నెస్ ట్రాకర్ డేటా వెల్లడించింది. దేశవ్యాప్తంగా 54 శాతం మంది లేటుగా తింటున్నట్లు 30 వేల మంది నుంచి సేకరించిన 35 లక్షల రీడింగ్స్‌లో గుర్తించారు. నిద్రకు ముందు 40 శాతం మంది టీ, కాఫీలు తాగుతున్నట్లు తేలింది. ఆలస్యంగా తినడం గ్లూకోజ్ స్థాయిలపై ప్రభావం చూపుతుందని ఈ స్టడీ తెలిపింది. డిన్నర్ త్వరగా ముగించడం, భోజనం తర్వాత నడక, రోజూ 30 నిమిషాల వ్యాయామం ఆరోగ్యానికి మేలు చేస్తాయని పేర్కొంది.


