దళిత భూములకు మాత్రమే హెచ్చరిక బోర్డులా?

AP: తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం సాదువారిపల్లెలోని సర్వేనెంబర్ 67లో ఉండే 173.04 సెంట్లు సాధువారిపల్లె దళితుల అధీనంలో ఉండగా పుల్లంపేట మండలం రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం దారుణమని అఖిల భారత అంబేద్కర్ సేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు డాక్టర్ పెంచలయ్య అన్నారు. ఆ సర్వే నెంబర్‌లో ఉండే భూములను కొందరు అగ్రవర్ణానికి చెందినవారు ఆక్రమించి సాగు చేసుకుంటూ అనుభవిస్తున్నారన్నారు. దళితులకు ఒక న్యాయం, అగ్రవర్ణాలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు.



