నీట మునిగిన ఊళ్ళు : అధికారుల చర్యలు
అల్పపీడనంతో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలంలో ఎరకరాయపురం, గొట్టమంగళాపురం, మంగళాపురం, గోపాలపురం, అన్నవరం, అంపిలి గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. అయితే స్థానిక సబ్‌కలెక్టర్, DSP, తహసీల్దార్, SIల సమన్వయంతో వెంటనే NDRF దళాలతో ముందస్తు చర్యలు చేపట్టారు.



