RTC బస్సు లేక ఆటో చార్జీల మోత

సూర్యాపేట జిల్లా చెన్నకేశవాపురం గ్రామానికి బస్సు సౌకర్యం లేక ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రోజుకు 5 సార్లు వచ్చిన బస్సు ఇప్పుడు పూర్తిగా నిలిపివేశారు. రాష్ట్రమంతా ఉచిత బస్సు ప్రయాణం ఉంటే, ఈ ఊర్లో డబ్బులిచ్చినా ప్రయాణించే పరిస్థితి లేదని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. ఆటో వాళ్లు 40 రూపాయిల చార్జీకి 120 రూపాయిలు వసూలు చేస్తూ దోచుకుంటున్నారని బాధపడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తమ గ్రామానికి బస్సు వచ్చేలా చేయాలనీ కోరుతున్నారు.


