AI జాబ్స్... మహిళలు ఎందుకు వెనుకబడుతున్నారు?

AI రంగంలో జాబ్స్ పెరుగుతున్నా.. మహిళలకు అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని LinkedIn రిపోర్ట్ తెలిపింది. గత ఏడాది కొత్తగా AI జాబ్స్‌లో చేరిన వారిలో మహిళలు 25% మందే ఉన్నారు. ఉన్నత స్థాయి పోస్టుల్లో వారి వాటా 13% మాత్రమే. ఇతర జాబ్స్‌తో పోలిస్తే AI రంగంలో రెండింతలకు పైగా జీతాలు లభిస్తున్నాయి. అయినా మహిళలు తక్కువ జీతాల పనుల్లో ఎక్కువగా ఉంటున్నారు. ఎక్కువ వర్కింగ్ అవర్స్, మెంటార్ల కొరత, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వారి కెరీర్‌కు అడ్డంకులుగా మారుతున్నాయి.



