చిన్న గొడవ.. యువకుడిపై ఐదారుగురి దాడి
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లా బాబూగఢ్‌లో ఓ యువకుడిపై ఐదారుగురు వ్యక్తులు దాడి చేశారు. చిన్నపాటి గొడవ తర్వాత యువకుడిని ఓ గదిలోకి తీసుకెళ్లి కొట్టినట్లు సమాచారం. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందించిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. దాడికి పాల్పడిన వారిని, దాడికి గురైన యువకుడిని గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
