వెడ్డింగ్ సీజన్‌లో వెల్వెట్ ట్రెండ్

వెడ్డింగ్ సీజన్‌లో వెల్వెట్ క్లాత్స్ మళ్లీ ఫ్యాషన్‌లోకి వచ్చాయి. గతంలో కొంతకాలం తగ్గినా.. ఇప్పుడు పెళ్లిళ్లు, ఫంక్షన్లలో ఆదరణ పెరుగుతోంది. డార్క్ కలర్స్ లోని వెల్వెట్ శారీలు, బ్లౌజులు, అనార్కలీలు, సల్వార్ కమీజ్‌లతో అమ్మాయిలు కొత్త లుక్ ట్రై చేస్తున్నారు. అబ్బాయిలు వెల్వెట్ నెహ్రూ జాకెట్లు, బంద్‌గలా ధరిస్తున్నారు. డిజైనర్లు తమ కొత్త కలెక్షన్లలో వెల్వెట్‌ను వాడుతున్నారు. ముఖ్యంగా ఈవెనింగ్, కూల్ వెదర్‌లో జరిగే ఫంక్షన్లలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది.
