← Back to news

హోటళ్ల కిచెన్లపై TG SAFE నిఘా

By A.Ajay· 1d ago
హోటళ్ల కిచెన్లపై TG SAFE నిఘా

TG: హైదరాబాద్‌లో హోటళ్ల పరిశుభ్రతపై TG SAFE కమిషనర్ అవినాష్ మహంతి కీలక కామెంట్స్ చేశారు. హోటళ్లలో బయట ఆకర్షణగా ఉన్నా, లోపల కిచెన్లలో పరిశుభ్రత లోపాలు కనిపిస్తున్నాయని తెలిపారు. కొన్ని కిచెన్లలో బొద్దింకలు, ఎలుకలు, ఈగలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. పచ్చి మాంసం, వెజిటేరియన్ ఆహారాన్ని ఒకే ఫ్రిజ్‌లో ఉంచిన సందర్భాలున్నాయని చెప్పారు. స్వీట్ షాపుల్లో పాడైన పదార్థాలు, పురుగులు, గడువు ముగిసిన ఆహారం గుర్తించామని తెలిపారు. రూల్స్ పాటించని వారిపై చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

More in TG