నెక్స్ట్ పెద్ద ఎత్తున ప్రొటెస్ట్స్?
80వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా హరిద్వార్‌లోని పతంజలి యోగపీఠ్‌లో రామ్‌దేవ్ బాబా ఎడ్యుకేషన్ సిస్టమ్‌పై కామెంట్స్ చేశారు. దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్‌లోని లోపాలు, గవర్నమెంట్ జాబ్ రిక్రూట్‌మెంట్లలో జరుగుతున్న అక్రమాలపై ఆందోళన వ్యక్తం చేశారు. స్కూళ్లలో సౌకర్యాలు లేకపోవడాన్ని ప్రస్తావించారు. పేపర్ లీక్స్ వల్ల స్టూడెంట్స్ రోడ్లపైకి వస్తున్నారని, ఎడ్యుకేషన్ అండ్ రిక్రూట్‌మెంట్ సిస్టమ్‌ను వెంటనే రీఫార్మ్ చేయాలని అన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ప్రొటెస్ట్స్ జరిగే అవకాశం ఉందని అన్నారు.



