ప్రజల హక్కుల కోసం పోరాటం: కాంగ్రెస్

ఢిల్లీలో 57 మెట్రో స్టేషన్లను మూసివేయడం, రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ న్యాయ విభాగం అధ్యక్షుడు అభిషేక్ మను సింఘ్వీ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ చర్యల వల్ల సాధారణ పౌరులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం నిర్ణయాలకు వ్యతిరేకంగా, ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని కాంగ్రెస్ పేర్కొంది.


